సిలువపై యేసు యొక్కచివరి ఏడూ మాటలు
THE SEVEN LAST WORDS
OF JESUS ON THE CROSS
యేసు – “నా ద్వారా తప్ప, ఎవడును తండ్రి యొద్దకు రాడు.”
తన రక్తము ద్వారా యేసు మన పాపములను శుద్ధి చేస్తాడు. ఆమెన్.
I. మొదటి మాట – క్షమాపణ.
“వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, దానిని కల్వరి అనబడు చోటుకు వచ్చినప్పుడు, అక్కడ ఆయనను సిలువ వేసారు, అక్కడ కుడి వైపున, ఒకనిని ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడ సిలువ వేసిరి. యేసు, తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు; గనుక వీరిని క్షమించుమని చెప్పెను” (లూకా 23:33-34).
II. రెండవ మాట – రక్షణ.
యేసుకు ఇరువైపులా, ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు.
“వ్రేలాడబడిన ఆ నేరస్తులలో [దొంగలు] ఒకడు, ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మును కూడ రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా వీధిలో ఉన్నావు, గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే? మనము చేసిన వాటికి నిజానికి పొందుకున్నాము; తగిన ఫలము పొందుచున్నాము: గాని ఈయన ఏ తప్పిదమును [తప్పు] చేయలేదని చెప్పెను. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనేను. అందుకాయన, వానిలో నేడు, నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నా వనెను“” (లూకా 23:39-43).
III. మూడవ మాట – మమకారము.
“ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియము, మగ్ద లేనే మరియము యేసు సిలువ యెద్ద నిలుచుండిరి. యేసు తన తల్లిని చూచి, తన తల్లి, తానూ ప్రేమించిన శిష్యుడను దగ్గర, నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీకుమారుడు అని తన తల్లితో చెప్పను! తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను! ఆ గడియ నుండి ఆ శిష్యుడు తన ఇంట చేర్చుకొనెను” (యోహాను 19:25-27).
IV. నాల్గవ మాట – ఆవేదన.
“మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటికమ్మెను. ఇంచుమించు మూడు గంటలప్పుడు, యేసు, ఏలీ, ఏలీ, లామాసబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను? ఆ మాటకు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్ధము? ” (మత్తయి 27:45-46).
V. ఐదవ మాట – శ్రమ.
“అటు తరువాత, సమస్తమును అప్పటికి సమాప్తమైనదని, యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు, నేను దప్పిగొనుచున్నాను అనెను. చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి యుండెను: కనుక వారు ఒక స్పాంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి, ఆయన నోటికి అందించిరి” (యోహాను 19:28-29).
VI. ఆరవ మాట – నెరవేర్పు.
“యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని, చెప్పి, తలవంచి ఆత్మను అప్పగించెను” (యోహాను 19:30).
VII. ఏడవ మాట – దేవునికి అప్పగించుకొనుట.
“అప్పుడు యేసు గొప్ప శబ్దముతో, కేకవేసి, తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నా ననెను: ఆయన ఈలాగు చెప్పి, ప్రాణము విడిచెను” (లూకా 23:46).