Promise

“….యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును…” ( కీర్తన 146:7)

👉 దేవుడు మాత్రమే ఈ పని చేయగలడు.
▪చెరలో ఉన్న యోసేపును,
▪ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను,
▪గోతిలో ఉన్న యిర్మీయాను,
▪ సంకెళ్ళలో ఉన్న పేతురును దేవుడు విడిపించడాన్ని జ్ఞాపకం చేసుకుందాం.

👉 ఇప్పుడు కూడా ఆయన ఆ పని చేయగలడు. ఒక్క మాటతో ఇత్తడి గెడలను తునాతునకలు చెయ్యగలడు. ఒక్క చూపుతో ఆయన ఇనుప సంకెళ్ళను త్రుంచివెయ్యగలడు. ఆయన ఆ పని చేస్తూనే ఉన్నాడు. వేలాది స్థలాల్లో కష్టాలపాలై పడి ఉన్నవారిని ఆయన వెలుగులోనికి, విశాలతలోనికి రప్పిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ చెరలో బందించబడి ఉన్నవారికి విడుదల ప్రకటిస్తూనే ఉన్నాడు.

ప్రియ స్నేహితుడా, ఈ సమయంలో నువ్వు దుఃఖం తోను, సందేహం తోను, భయం తోనూ ఉన్నావా? అయితే ఆయన నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు.

నీకు స్వేచ్చనివ్వడం యేసు క్రీస్తుకు ఎంతో ఆనందం. విడిపించబడడం నీకెంత ఆనందాన్ని కలిగిస్తుందో, నిన్ను విడిపించినప్పుడు ఆయనకు కూడా అంత ఆనందం కలుగుతుంది. నువ్వు ఇనుప బంధకాలను తెంపనక్కరలేదు. ఆయనే ఆ పని నీ కోసం చేస్తాడు. కేవలం ఆయన మీద నమ్మకం ఉంచు. ఆయన నీ విమోచనకర్తగా వస్తాడు.

👉 ఇప్పుడు నువ్వు నిన్ను వెంటనే విడిపించగల దేవుని మీదనే నమ్మకం ఉంచాలి.

ఇప్పుడు గాని నువ్వు యేసు ప్రభువులోను, ఆయన ఉచిత కృపలోను ఆయన సంపూర్ణశక్తిలోను నమ్మకం ఉంచినవాడవైతే సాతాను నిన్ను బంధించి ఉంచలేడు. పాపం నిన్ను అణచిపెట్టి ఉంచలేదు. నిరాశ కూడా నిన్ను ఏమీ చెయ్యలేదు.

ఇప్పుడు నీ ముందున్న దేవుని వాక్యాన్నే విమోచనా గీతంగా పాడుకో. ‘బంధింపబడిన వారిని యెహోవా విడుదల చేయును’.

దైవాశ్శీసులు!!!